నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి
NEWS Jan 13,2025 09:55 am
ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ను వెంటనే డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ సీనియర్ నేత మహాసేన రాజేష్. 2024 ఎన్నికలకు ముందు ఎంతగానో కష్ట పడ్డాడని అన్నారు. మరెన్నో అవమానాలు భరించాడని, ఆనాటి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. నారా లోకేష్ పడిన కష్టం వల్లనే టీడీపీకి 134 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయని స్పష్టం చేశారు.