పండుగ వేళ సీఎం వినతుల స్వీకరణ
NEWS Jan 13,2025 09:29 am
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు నారా భువనేశ్వరి. గెలుపొందిన మహిళలకు, పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు సీఎం దంపతులు.. మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ, నందమూరి వసుంధర, దేవాన్ష్ పాల్గొన్నారు. అంతకు ముందు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.