20 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం
NEWS Jan 13,2025 06:28 am
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంక్రాంతి పండుగ సంబురాలలో పాల్గొన్నారు. నాలుగు ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు . ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇంటి నమూనాను ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు.