సీఎం ఆదేశం బిల్లులకు మోక్షం
NEWS Jan 13,2025 05:52 am
సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. సంక్రాంతి పండుగ పూర్తయ్యే లోపు ఏ ఒక్క బిల్లు పెండింగ్ లో ఉండ కూడదని ఆదేశించారు. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, చిన్న తరహా కాంట్రాక్టర్లకు వారి ఖాతాల్లో డబ్బులను జమ చేస్తోంది ప్రభుత్వం. నిన్న, ఇవాళ సెలవులు ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ అందరికీ పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.