మాతృభూమి సేవలు ప్రశంసనీయం
NEWS Jan 13,2025 05:47 am
నల్లమల్ల ప్రాంతంలో మాతృభూమి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. సంస్థ 10 ఏళ్లు పూర్తి చేసుకోవడం, మన్ననలు పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పుట్టిన ఊరును, కన్నవారిని మరిచి పోకుండా సమాజానికి తన వంతుగా సేవలు అందించడం మామూలు విషయం కాదన్నారు. ప్రముఖులను సన్మానించారు. విశిష్ట సేవలు అందించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.