తిరుమల క్షేత్రం పోటెత్తిన భక్తజనం
NEWS Jan 13,2025 03:30 am
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారిని , అలివేలు మంగమ్మలను 70 వేల 966 మంది భక్తులు దర్శించుకున్నారు. 15 వేల 681 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.95 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం డైరెక్ట్ లైన్ కొనసాగుతోందన్నారు.