కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదు
NEWS Jan 13,2025 03:53 pm
కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బాన్సువాడలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు.పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. రైతుల పథకాలను నిర్వీర్యం చేస్తుందని మండి పడ్డారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. పార్టీ ఫిరాయించిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ క్షమించదని,అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫలం చెందిన ఆ పార్టీలో పోచారం ఎందుకు చేరారో చెప్పాలన్నారు. కొంతమంది నాయకులు పార్టీ మారిన ప్రజల BRS తోనే ఉన్నారన్నారు.