మందా జగన్నాథం కన్నుమూత
NEWS Jan 12,2025 04:13 pm
మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మందా జగన్నాథం హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మందా జగన్నాథం నాగర్ కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి 4 సార్లు (1996, 1999, 2004, 2009) ఎంపీగా గెలిచారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగానూ సేవలందించారు. మూడు సార్లు టీడీపీ తరఫున లోక్ సభలో అడుగుపెట్టిన ఆయన 2009లో కాంగ్రెస్ తరఫున నెగ్గారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరారు.