ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు
NEWS Jan 12,2025 03:48 pm
మల్యాల మండలంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్యాల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి నిర్వాహకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ.. యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన మాటలే యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం రక్తదానం చేసిన యువకులను ప్రశంసించారు. ఆయా పార్టీల నాయకులు, సామాజిక సేవకులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.