కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జువ్వాడి
NEWS Jan 12,2025 03:40 pm
బండలింగాపూర్ గ్రామంలో శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవంలో, వేంపేట్ గ్రామంలో మల్లన్న కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆ దేవుని వేడుకున్నట్టు ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, బండలింగాపూర్ మాజీ సర్పంచ్ లు జంగస్వామి, చిన్నరెడ్డి, దేవస్థానం చైర్మన్ రామాంజరెడ్డి, సురేందర్ రెడ్డి, బద్దం స్వామిరెడ్డి, గోపిడి రాజారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.