ఆరుగురు పేకాట రాయుళ్ళ అరెస్టు
NEWS Jan 12,2025 03:36 pm
మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఎస్ఐ శ్యామ్ రాజ్. గ్రామ శివారులోని మామిడి తోటలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు మెట్‌పల్లి సిఐ నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు పేకాట అడ్డాలపై దాడులు చేసి ఆరుగురు వ్యక్తులు అరెస్టు చేశారు. వారి నుంచి 46,500, నగదు 5 సెల్ ఫోన్లు, 5 బైకులు స్వాధీనం చేసుకున్నారు.