కామారెడ్డి స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు
NEWS Jan 12,2025 03:42 pm
కామారెడ్డి జీల్లా కేంద్రంలోని పలు ప్రయివేట్ విద్యాసంస్థల్లో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీఆర్ స్కూల్, ఆర్యభట్ట, పీజేఆర్ డిగ్రీ, మంజీరా డిగ్రీ, ఆర్కే, ఎస్‌ఆర్కే కళాశాల, లిటిల్ స్కాలర్ స్కూల్స్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ముందస్తుగా సంక్రాంతి పండుగను జరిపారు. అలాగే విద్యార్థినులకు ముగ్గుల పోటీలు, బాలురకు గాలిపటాలు పోటీలు నిర్వహించారు. విద్యాసంస్థల ఆవరణల్లో భోగి మంటలు ఏర్పాటు చేశారు. భిక్కనూరులోని పలు స్కూళ్లలోనూ సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.