బీజేపీ మండలాధ్యక్షునిగా గాజుల మల్లేశం
NEWS Jan 11,2025 05:49 pm
మల్యాల మండల బీజేపీ అధ్యక్షునిగా గాజుల మల్లేశంను నియమించినట్టు పార్టీ ఎన్నికల అధికారి కాశం వెంకటేశ్వర్లు తెలిపారు. అధ్యక్ష పదవి కోసం బొట్ల ప్రసాద్, గాజుల మల్లేశం, బొబ్బిలి వెంకట స్వామి ఈ ముగ్గురు పోటీ పడగా, మండలంలోని బూత్ కమిటీల అభిప్రాయ సేకరణ చేసి మల్లేశంను మండలాధ్యక్షునిగా పార్టీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకంతో మండలాధ్యక్షునిగా అవకాశం ఇచ్చిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులకు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు మల్లేశం కృతజ్ఞతలు తెలియజేశారు.