నిజామాబాద్ ఆసుపత్రి తీరుపై ఆగ్రహం
NEWS Jan 11,2025 05:05 pm
విధులు మరచి విందులు, వినోదాల్లో మునిగి తేలిన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తీరుపై రోగులు, బంధువులు దుమ్మెత్తి పోస్తున్నారు. రోగులను గాలికొదిలేసి జన్మదిన వేడుకలు చేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రినే ఏకంగా ఫంక్షన్ హాల్‌గా మార్చేసిన అధికారి తీరును నిరసిస్తూ ఆస్పత్రి ఎదుటే పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌పై రోగులు మండిపడుతున్నారు. తన ఛాంబర్‌ను ప్రైవేట్ ఫంక్షన్ హాలుగా మార్చేసి బర్త్ డే చేయడంపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.