మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన సుధాకర్ రెడ్డి
NEWS Jan 11,2025 02:44 pm
వికారాబాద్: టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వికారాబాద్ జిల్లా రాజకీయాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం ఉంటుందని సుధాకర్ రెడ్డి కి హామీ ఇచ్చారు.