కొండగట్టులో ముక్కోటి ఏకాదశి వేడుకలు
NEWS Jan 10,2025 03:42 pm
కొండగట్టు అంజన్న సన్నిధిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజామునే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు ఆలయ ప్రధాన అర్చకులు కపీందర్, జితేందర్, చిరంజీవి ఆధ్వర్యంలో సుప్రభాత సేవ అనంతరం ప్రాతఃకాల పూజ తదుపరి స్వామి వారలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.