చంద్రబాబు..పవన్ రాజీనామా చేయాలి
NEWS Jan 10,2025 09:57 am
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నిప్పులు చెరిగారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత వహించి సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీలో పోలీసుల పాత్ర నామమాత్రంగా ఉంటుందన్నారు. తమ పాలనా పరంగా వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు వారిని బలి చేస్తే ఎలా అని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్, ఈవో ఏం చెబితే వారు అదే చేస్తారని అన్నారు.