క్షమాపణ చెబితే సరిపోతుందా
NEWS Jan 10,2025 07:42 am
తిరుపతి ఘటనకు పూర్తి బాధ్యత కూటమి సర్కార్ , టీటీడీదేనని అన్నారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదన్నారు. భక్తుల భద్రత గురించి సీఎం పట్టించు కోలేదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. బాబు సీఎం అయిన ప్రతీసారి జనం చని పోతున్నారని వాపోయారు. క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని మండిపడ్డారు.