క్షతగాత్రులకు ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శనం
NEWS Jan 10,2025 05:35 am
తిరుపతి తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి రుయా స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన శ్రీవారి భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి. సీఎం నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో మొత్తం 52 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఈ సందర్బంగా సీఎం, చైర్మన్ , ఈవోకు ధన్యవాదాలు తెలిపారు భక్తులు.