శ్రీశైలంలో ఏకాదశి మహోత్సవం
NEWS Jan 10,2025 05:25 am
ప్రముఖ పుణ్య శైవ క్షేత్రమైన శ్రీశైలం భక్తులతో కిటకిట లాడుతోంది. ఇసుక వేస్తే రాలనంత జనం తరలి వచ్చారు. పాలక మండలి విస్తృత ఏర్పాట్లు చేసింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్లకు విశేష పూజలు చేశారు. కన్నుల పండుగగా భక్తులకు ఉత్సవ మూర్తుల ఉత్తర ద్వార దర్శనం లభించింది. రావణ వాహన సేవ, గ్రామోత్సవం వేడుకగా జరిగింది