టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి
NEWS Jan 10,2025 05:19 am
తిరుపతి ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి బాధ్యత వహించాలన్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, 32 మందికి పైగా గాయపడ్డారని వాపోయారు.