తిరుమలలో రాజకీయాలకు చోటు లేదు
NEWS Jan 10,2025 05:10 am
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ కామెంట్స్ చేశారు. తిరుపతి ఘటనపై స్పందించారు. తిరుమల పవిత్రత అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చైర్మన్, సభ్యులు, ఈవో సమన్వయంతో పని చేసుకోవాలని సూచించారు. ఇక్కడ రాజకీయాలకు చోటు లేదని హెచ్చరించారు. గీత దాటితే వేటు తప్పదన్నారు.