ప్రముఖ గాయకుడు జయచంద్రన్ ఇక లేరు
NEWS Jan 10,2025 04:30 am
మలయాళ సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజ గాయకుడు పి. జయచంద్రన్ కన్నుమూశారు. ఆయన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ , తదితర భాషలలో 16 వేలకు పైగా పాటలు పాడారు. రోజావే చిన్ని రోజావే, అనగనగా ఆకాశం ఉంది అన్న పాటలు తెలుగు వారిని మరింత ఆకట్టుకునేలా చేశాయి. గత కొన్ని సంవత్సరాలుగా జయచంద్రన్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఆయన మృతితో సినీ రంగం ఒక్కసారిగా విషాదానికి లోనైంది.