వైకుంఠ ఏకాదశి భక్తుల రద్దీ
NEWS Jan 10,2025 03:30 am
వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని శ్రీ వెంకటేశ్వరాలయం, గంగస్తాన్ ఉత్తర తిరుమల, నర్సింగ్ పల్లి ఇందూర్ తిరుమల, బాన్స్వాడ తెలంగాణ తిరుమల ఆలయాలతో పాటు కామారెడ్డి జిల్లా జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలోని ఉన్న వేంకటేశ్వరస్వామి, గోపాల్ స్వామి రోడ్‌లో ఉన్న వేణుగోపాల్‌స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శనం చేసుకున్నారు.