కామారెడ్డిలో రంగవల్లుల పోటీలు
NEWS Jan 09,2025 12:19 pm
సంక్రాంతి సంబరాలు 2025 పురస్కరించుకుని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అన్ని శాఖల మహిళా ఉద్యోగులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అసిస్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి, అడిషనల్ కలెక్టర్ విక్టర్ సార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతగా షెడ్యూల్ సంక్షేమ అధికారి రజిత పాల్గొన్నారు.