ఘటనా స్థలాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్
NEWS Jan 09,2025 11:38 am
తిరుపతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భద్రతా ఏర్పాట్లు, తొక్కిసలాటకు గల కారణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు. ప్రభుత్వ పరంగా ఇప్పటికే ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని ఆదేశించారు.