తప్పంతా టీటీడీ అధికారులదే
NEWS Jan 09,2025 09:44 am
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్బంగా తిరుపతిలో చోటు చేసుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందడం, 32 మందికి పైగా గాయపడడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి. భక్తులను మన్నించాలని కోరారు. వారికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నామన్నారు. టీటీడీ అధికారుల వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందన్నారు.