ఘనంగా గోదా రంగనాథుల కళ్యాణం
NEWS Jan 09,2025 09:52 am
మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలోని స్థానిక రామాలయంలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం శ్రీ చక్రపాణి మాధవాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి ఇల్లేందుల కృష్ణమాచారి పుస్తె, మట్టెలు తీసుకురాగా మహిళలు మంగళారతులతో వేద మంత్రోత్సవాల మధ్య కళ్యాణాన్ని కమనీయంగా జరిపించారు. అంతకు ముందు ఆలయ పండితులు, ఆలయ కమీటి సభ్యుల ఇళ్ల నుంచి తలంబ్రాలు ఎదుర్కోలు చేశారు.