టీటీడీ ఈవో..కలెక్టర్ పై సీఎం సీరియస్
NEWS Jan 09,2025 09:21 am
తిరుపతి ఘటనపై జిల్లా కలెక్టర్, టీటీడీ ఈవో శ్యామలరావుపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. గతంలో లాగే ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేశామని తెలిపిన ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో చేశారని అలాగే చేస్తే ఎలా..నీకంటూ కొత్త ఆలోచనలు లేవా అంటూ మండిపడ్డారు. టెక్నాలజీని ఎందుకు వాడుకోలేదంటూ ప్రశ్నించారు. సరిగ్గా ఎందుకు ఏర్పాట్లు చేయలేదని, పద్దతి ప్రకారం పని చేయడం నేర్చుకోవాలంటూ ఆదేశించారు.