బాధిత కుటుంబానికి స్టాలిన్ భరోసా
NEWS Jan 09,2025 09:03 am
ఏపీలోని తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. వీరిలో నలుగురు ఏపీకి చెందిన వారు కాగా మరొకరు కర్ణాటక, తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన వారు. భక్తుడు మృతి చెందడం పట్ల సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.