బీర్లు నిలిపివేతపై జూపల్లి కామెంట్స్
NEWS Jan 09,2025 05:47 am
రేట్లు పెంచనందుకే బీర్ల స్టాక్ పంపించమని బేవరేజ్ సంస్థ తెలిపిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 33 శాతం పెంచాలని కోరుతున్నారని, అలా పెంచితే ప్రజలపై అధిక భారం పడుతుందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే ధర తక్కువన్నారు. ఇప్పటికే రూ. 1100 చెల్లించామని, ఇంకా రూ. 650 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. రిటైర్డ్ జడ్జితో కమిటీ వేశామని, నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామన్నారు.