టీటీడీ టోకెన్ల ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి, మనోధైర్యం ఇవ్వాలని టీటీడీ పాలకమండలికి సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సాయం చేయాలని జనసైనికులకు సూచించారు.