వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో జరిగిన తోపులాటపై తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. తిరుపతిలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. టోకెన్లు జారీ చేసే ఒక సెంటర్లో డీఎస్పీ గేట్లు తెరిచారని, దీంతో తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన 40 మందిని రుయా ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు.