కేటీఆర్ కు ఊరట లాయర్ కు అనుమతి
NEWS Jan 08,2025 11:05 am
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి ఊరట లభించింది. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీసీ టీవీ పర్యవేక్షణలో కేటీఆర్ ను విచారించాలని స్పష్టం చేసింది. విచారణ జరుగుతుండగా లైబ్రరీ రూంలో లాయర్ కూర్చునేందుకు అనుమతి ఇచ్చింది. కేటీఆర్ ఓ గదిలో, లాయర్ మరో గదిలో ఉండాలని ఆదేశించింది. ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టుకు రావాలని సూచించింది కోర్టు.