బెస్ట్ పార్లమెంటేరియన్ గా శశి థరూర్
NEWS Jan 08,2025 10:56 am
కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ రాజకీయవేత్తగా, రచయిత, దౌత్యవేత్తగా, ఐక్యరాజ్య సమితి మాజీ అండర్ సెక్రటరీ జనరల్ అయిన థరూర్ కు 2024 సంవత్సరానికి పార్లమెంటేరియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు. ఇండియన్ పాలిటిక్స్ లో అత్యంత జనాదరణ పొందిన ఎంపీగా గుర్తింపు పొందారు.