సీఎం రేవంత్‌రెడ్డి సమైక్యవాది
NEWS Jan 08,2025 05:22 am
సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమైక్యవాది అని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు.సీఎం వ్యవహారశైలి కారణంగా హైదరాబాద్ నుంచి రియల్ ఎస్టేట్, ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి తరలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో కేటీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఇరికించిందని,క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడాన్ని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారన్నారు.బీజేపీ, కాంగ్రెస్‌లు కుట్ర పూరితంగానే కేటీఆర్, కేసీఆర్‌ను కేసుల్లో ఇరికించాలనే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.