మోడీ పర్యటనకు భారీ భద్రత
NEWS Jan 08,2025 04:34 am
విశాఖపట్నం జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ పరిసరాలను ఎస్పీజీ తమ అధీనంలోకి తీసుకుంది. 5 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. బందోబస్తు విధుల్లో 32 మంది ఐపీఎస్ అధికారులు, 18 మంది అడిషనల్ ఎస్పీలు, 60 మంది డీఎస్పీలు, 180 మంది సీఐలు, 400 మంది ఎస్ఐలు ఉన్నారు.