శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.20 కోట్లు
NEWS Jan 08,2025 04:30 am
తిరుమల శ్రీవారిని 62 వేల 566 మంది దర్శించుకున్నారు. 16 వేల 21 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.20 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం డైరెక్టు లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 8 గంటలకు పైగా దర్శన భాగ్యం కలుగనుందని పేర్కొన్నారు.