తెలంగాణ..బాంబే సీజేల బదిలీ
NEWS Jan 07,2025 10:55 pm
సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది. తెలంగాణ, బాంబే హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేసింది. కోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధేను బాంబే హైకోర్టుకు, బాంబే హైకోర్టు సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని సూచించింది. దీనిపై ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.