రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
NEWS Jan 07,2025 10:17 pm
ఏపీలోని విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు పీఎం నరేంద్ర మోడీ. రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు తన చేతుల మీదుగా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. నగరంలో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రులు పాల్గొంటారు.