బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
NEWS Jan 07,2025 03:08 pm
మల్యాల మండలం తక్కళ్ళపల్లికి చెందిన దొనకొండ చంద్రయ్య, తాటిపల్లికి చెందిన సుంకపాక హన్మంతు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంగళవారం వారి కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు. అన్నివేళలా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చి, ఒక్కో కుటుంబానికి రూ. 5వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తిరుపతి, వంశీ, అనిల్, ప్రతాప్, వినయ్, చారి, మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.