అంగన్వాడీ టీచర్స్..హెల్పర్స్ సమస్యలు తీర్చండి
NEWS Jan 07,2025 12:23 pm
అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి మెట్పల్లి ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ కు కనీస వేతనం రూపాయలు రూ. 18,000 ఇస్తామన్న హామీ అమలు చేయాలని కోరారు. ఇంటి అద్దెలు, గ్యాస్ బిల్స్ ఇతర పెండింగ్ బిల్స్, మినీ టీచర్స్ వారి పదోన్నతికి చర్యలు తీసుకోవాలని కోరారు.