డ్రగ్స్ రహిత తెలంగాణగా మారుద్దాం
NEWS Jan 07,2025 09:02 am
మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, విలువైన జీవితాలను కోల్పోవద్దంటూ పిలుపునిచ్చారు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటి అనన్య నాగళ్ళ. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని అన్నారు. జీవితం ఒక్కసారే వస్తుందని, దానిని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.