వార్డు సభ్యుల చొరవతో రేషన్ కార్డు
NEWS Nov 10,2026 01:39 pm
రాఘవపేట: గ్రామానికి చెందిన గంధం రత్నాకర్ కుటుంబానికి వార్డు సభ్యులు నత్తి రామ్, లక్ష్మణ్‌ల చొరవతో రేషన్ కార్డు లభించింది. రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన వార్డు సభ్యులు సంబంధిత నాయకులతో మాట్లాడి కార్డు మంజూరుకు కృషి చేశారు. ఎలాంటి ఖర్చు లేకుండా రేషన్ కార్డు అందడంతో రత్నాకర్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని వార్డు సభ్యులు తెలిపారు.