ఫార్ములా వన్ కారు రేస్ కేసుకు సంబంధించి దూకుడు పెంచింది ఏసీబీ, ఈడీ. ఇదే సమయంలో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేయడంతో తను సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినాలని ముందస్తు పిటిషన్ దాఖలు చేయడం విశేషం.