9న విచారణకు కేటీఆర్ హాజరు
NEWS Jan 07,2025 08:43 am
ఫార్ములా వన్ కార్ రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ఈనెల 9న విచారణకు హాజరవుతారని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. ప్రభుత్వం నుండి ఇతరులకు వెళ్లలేదని, లాభం జరిగిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక్క పైసా పక్కదారి పట్టలేదన్నారు. తదుపరి వ్యూహంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామన్నారు.