ఏపీ సీఎస్ కు అదనపు బాధ్యతలు
NEWS Jan 07,2025 08:21 am
ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కె. విజయానంద్ కు అదనపు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ఆయన పలు ఉన్నత పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, ఏపిట్రాన్సకో చైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్ గా సిఎస్ విజయనంద్ కు పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్వర్తులు జారీ చేసింది సర్కార్.