విచారణకు కేటీఆర్ సహకరించాలి
NEWS Jan 07,2025 08:14 am
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాలని, కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిందని మంత్రి జూపల్లి కృష్ణ రావ్ అన్నారు. తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. బాన్సువాడలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ నిర్వహించారు.