ఆకుల ఫౌండేషన్ డైరీ ఆవిష్కరణ
NEWS Jan 07,2025 07:15 am
బుచ్చయ్యపేట మండలం లోని సామాజిక కార్యకర్త ఆకుల ఫౌండేషన్ అధినేత ఆకుల నాగేశ్వరరావు చేతుల మీదుగా రూపొందించిన 2025 డైరీని ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పిటిసి ఫోరం అధ్యక్షుడు దొండ రాంబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 30 ఏళ్లుగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న నాగేశ్వరరావును శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పలరాజు ఆర్ భీమవరం సర్పంచ్ అమ్మనాయుడ పొట్టిదొరపాలెం వైస్ సర్పంచ్ శ్రీను, వైసిపి నాయకులు బుజ్జి పోలి బాబు, నాయకులు పాల్గొన్నారు.