మంత్రి పొన్నంతో జుక్కల్ ఎమ్మెల్యే భేటీ
NEWS Jan 07,2025 08:52 am
మంత్రి పొన్నం ప్రభాకర్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మర్యాద పూర్వకంగా కలిశారు. తమ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, బస్ డిపోలు ఏర్పాటు చేయాలని కోరారు. వెనుకబడిన జుక్కల్ లో బీసీ స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేస్తే మరింత పేద విద్యార్థులకు మేలు చేకూరుతుందన్నారు. ఈ సందర్బంగా మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.